దుబాయ్లో రెండ్రోజులపాటు ఫ్రీ పార్కింగ్
- September 10, 2018
హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా సెప్టెంబర్ 13న సెలవు దినం కావడంతో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) రెండ్రోజులపాటు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తోంది. శనివారం సెప్టెంబర్ 15 నుంచి తిరిగి పార్కింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. గురువారం కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ మూసివేయబడ్తాయి. ఉమ్ అల్ రమూల్లో మాత్రం రౌండ్ ద క్లాక్ సేవలు అందుతాయి. ఇదిలా వుంటే దుబాయ్ మెట్రో రెడ్ లైన్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అందుబాటులో వుంటాయి. గ్రీన్ లైన్ ఉదయం 5.30 నిమిషాల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తుంది. దుబాయ్ ట్రామ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తుంది. బస్సులకు సంబంధించిన సమయాల్ని కూడా ఆర్టిఎ వివరించింది. మెట్రో సర్వీసులను లింక్ చేస్తూ మెట్రో లింక్ బస్సులు నడుస్తాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







