భవనం పైనుంచి పడి మెయిడ్ మృతి
- September 11, 2018
షార్జా: 22 ఏళ్ళ మెయిడ్ ఓ భవనం 19వ ఫ్లోర్ నుంచి కింది పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన షార్జాలోని అల్ కస్బా ప్రాంతంలో జరిగింది. రక్తపు మడుగులో పడి వున్న మెయిడ్‌ని కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ గుర్తించి, షార్జా పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ మరియు అంబులెన్స్ చేరుకున్నా, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 60 ఏళ్ళ మహిళ, ఆమె తనయుడు (30 ఏళ్ళు) వద్ద బాధితురాలు మెయిడ్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. కిచెన్‌ని శుభ్రం చేస్తుండగా, విండో నుంచి కిందికి పడి మెయిడ్ ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. విచారణ నిమిత్తం మృతురాలు పనిచేస్తోన్న కుటుంబానికి చెందిన 30 ఏళ్ళ వ్యక్తిని బుహైరా పోలీస్ స్టేషన్‌కి తీసుకు వెళ్ళారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







