హీరో ఆది తండ్రిగా ...
- December 17, 2015
త్వరలో గరం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న యంగ్ హీరో ఆది.. సినిమా రిలీజ్ కు ముందే మరో శుభవార్త చెప్పాడు. గురువారం మధ్యాహ్నం ఆది భార్య అరుణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆది దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం సాయికుమార్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గరం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆది ఈ సినిమాతో మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదాశర్మ హీరోయిన్ గా నటించింది. అగస్త్య సంగీతం అందించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









