వాషింగ్టన్‌లో హరికేన్ ఎమర్జెన్సీ
- September 11, 2018
అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ప్లారెన్స్' హరికేన్ అగ్రరాజ్యం అమెరికా తూర్పు తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం బెర్ముడాకు 1,100కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. కరోలినా, వర్జీనియా రాష్ట్రాల మధ్య రేపు రాత్రికి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని అక్కడి వాతారణ విభాగం తెలిపింది. దీంతో ఈ రాష్ట్రాల్లో తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది భారీ విధ్వంసం సృష్టించే అవకాశముందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అమెరికా తూర్పు తీరాన్ని 'ఫ్లోరెన్స్' తాకనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్‌లో మంగళవారం తుఫాను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వాషింగ్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు, వరదలు రావచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. 15 రోజుల పాటు హెచ్చరికలు అమల్లో ఉంటాయన్న వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్.. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 10 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. కాగా చివరిసారిగా వాషింగ్టన్‌లో 2016లో తుఫాను ఎమర్జెన్సీని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







