హమాద్‌ టౌన్‌లో కార్ల దొంగ అరెస్ట్‌

- September 11, 2018 , by Maagulf
హమాద్‌ టౌన్‌లో కార్ల దొంగ అరెస్ట్‌

మనామా: హమాద్‌ టౌన్‌లో కార్లను దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నార్తరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ అరెస్ట్‌ని ధృవీకరించారు. రెండు దొంగతనాలు జరిగిన అనంతరం తమకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామనీ, ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఓ ఘటనలో పార్క్‌ చేసిన కారుని దొంగిలించిన నిందితుడు, మరో కేసులో వాహనం నడుపుతున్న వ్యక్తిని బెదిరించి, అతని దగ్గర్నుంచి వ్యాలెట్‌ని సైతం లాక్కుని, కారుతో ఉడాయించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com