సౌదీ చేస్తున్న కొత్త ఆలోచనలు
- September 17, 2018
రియాద్ : సౌదీ అరేబియా పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొత్త చర్యలు చేపట్టింది. ఉమ్రా యాత్ర కోసం వీసాతో సౌదీఅరేబియాకు వచ్చే భక్తులు ఇక నుంచి 30 రోజుల్లో దేశంలోని అన్ని నగరాలను పర్యటించవచ్చని ఆ సర్కారు ప్రకటించింది. ఉమ్రా యాత్రలో భాగంగా భక్తులు 15 రోజుల పాటు మక్కా, మదీనాల్లోని పెద్ద మసీదులను సందర్శించాలని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ వజ్జన్ చెప్పారు. హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో గడచిన నాలుగురోజుల్లో 25వేల మందికి ఉమ్రా కోసం వీసాలు జారీ చేశామని అజీజ్ వెల్లడించారు. సౌదీలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ కొత్త నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







