'కరామా' దోపిడీ కేసులో అరెస్ట్‌లు
- December 18, 2015
దుబాయ్ పోలీసులు ఆపరేషన్ 'మిరేజ్ డ్రీమ్' పేరుతో కరామా దోపిడీ కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు. ముసుగులు దరించిన కొందరు వ్యక్తులు కరామాలోని ఎక్స్ఛేంజ్ ఆఫీస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ దొంగలు, ఆ కార్యాలయంలోని ఇద్దరు ఇండియన్స్, ఓ ఫిలిప్‌కి చెందిన మహిళా ఉద్యోగులపై టియర్ గ్యాస్‌ని ప్రయోగించి, మిగతావారిని తుపాకీలతో బెదిరించి దోపిడీ చేశారు. పోలీసులు దుండగుల్ని ఈస్టర్న్ యూరోప్‌కి చెందినవారిగా గుర్తించారు. ఇంటర్‌పోల్ అధికారులకు సమాచారమిచ్చిన దుబాయ్ పోలీసులు, దుండగుల్ని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. దొంగిలించిన కార్ నంబర్ ప్లేట్‌ని వేరే కారుకి వినియోగించి, ఆ కారులో వచ్చి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారనీ, దొంగతనం జరిగిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నామనీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









