తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు
- December 18, 2015
ఈ నెల 20న అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించామని, గుడివాడలో గత సంవత్సరం అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనీనటుడు కృష్ణకు అందజేస్తున్నట్లు చెప్పారు. అక్కినేని గోల్డెన్ హీరోయిన్లు పేరుతో ఆయనతో పనిచేసిన విజయనిర్మల, జమున, జయప్రద, జయసుధలకు పురస్కారాలు అందజేయనున్నారు. అనంతరం నవరత్నాలు పేరుతో తొమ్మిది రంగాల్లోని ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో శారద ఆకునూరి, రవి కొండబోలు, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







