అక్టోబర్ 5న విజయ్ దేవరకొండ నోటా విడుదల..
- September 22, 2018
నోటా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరొకండకు ఇది తొలి ద్విభాషా చిత్రం. ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. తమిళ్ వర్షన్ లోనూ విజయ్ సొంత డబ్బింగ్ చెప్పుకున్నారు. మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంతన కృష్ణణ్ సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: ఆనంద్ శంకర్
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా
నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్
కథ: షాన్ కరుప్పుసామి
సంగీతం: స్యామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ: శాంతన కృష్ణణ్
ఎడిటర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా
ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







