దుబాయ్ :కారు బ్యాటరీ దొంగల అరెస్ట్
- September 24, 2018
దుబాయ్:ఆసియాకి చెందిన నలుగురు సభ్యుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. జబెల్ అలి, కుసైస్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో వీరు తరచూ దొంగతనాలకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల గురించిన ఫిర్యాదులు అందడంతో పోలీసులు, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. కారు బ్యాటరీల్ని వీరు దొంగిలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. కార్ల నుంచి బ్యాటరీలను దొంగిలించి, వాటిని సగం ధరకే విక్రయిస్తుంటామని నిందితులు విచారణలో అంగీకరించారు. వరుస దొంగతనాల నేపథ్యంలో క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడంతో, నిందుతల్ని పట్టుకోగలిగినట్లు పబ్లిక్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దుబాయ్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ రషీద్ బిన్ సారి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







