రోజాను నిమ్స్ కి తరలింపు..
- December 18, 2015
అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాట, అరెస్టు సందర్భంగా తీవ్రంగా గాయపడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నాంపల్లి పోలీసు స్టేషన్ నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ ఆవరణలోని వైఎస్ఆర్ సీఎల్పీ ఆఫీసు వద్దకు వెళ్లబోతుండగా రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆమెను బయటకు పంపేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అరెస్టు సమయంలో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రోజా కింద పడిపోయారు. ఆమెను అదే పరిస్థితిలో నాంపల్లి పోలీసు స్టేషన్‌కు బలవంతంగా తరలించారు. అయితే స్టేషన్‌కు వెళ్లేలోపే ఆమె స్పృహతప్పి పడిపోయారు. దాంతో ఆమెను పోలీసు స్టేషన్ నుంచి అంబులెన్సులో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, నాంపల్లి పోలీసు స్టేషన్ వద్ద ఎమ్మెల్యే రోజాను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్నా రోజాను అరెస్టు చేస్తారా.. ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆయన మండిపడ్డారు. సస్పెండైన ఎమ్మెల్యేను అసెంబ్లీ ఆవరణలోకి కూడా రానివ్వరా, సస్పైండైతే సభలోకి రాకూడదు గానీ అసలు అసెంబ్లీప్రాంగణంలోకి కూడా రానివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







