హీరో వెంకటేష్ ఖాతాలో మరో మల్టీ స్టారర్
- September 28, 2018
టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాల జోరు పెంచిన నటుడు విక్టరీ వెంకటేష్. మహేష్, పవన్ కళ్యాణ్‌తో వెంకీ చేసిన మల్టీ స్టారర్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ ట్రెండ్ జోరందుకుంది. ప్రస్తుతం వెంకీ.. వరుణ్ తేజ్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఇదిలా ఉండగా ఆయన మరో నాలుగు చిత్రాల్ని అంగీకరించి నట్లు తెలిసింది. ఇందులో కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో చైతూతో కలిసి మల్టీ స్టారర్ చేయనున్నాడట. ఈ చిత్రానికి వెంకీ మామ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో అరవింద సమేత అనే చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్ త్వరలో వెంకటేష్‌తో మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడట. వీటితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం..త్రినాథరావు నక్కిన రూపొందించనున్న సినిమాతో పాటు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ వెంకటేష్ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి వెంకటేష్ డైరీ మాత్రం వచ్చే సంవత్సరానికి కూడా ఫుల్ అయినట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







