5కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్..

- September 28, 2018 , by Maagulf
5కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్..

గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్ దాడులు జరుగుతున్నాయని, 5 కోట్ల ఫేస్ బుక్ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్ అయ్యాయని శుక్రవారం (సెప్టెంబర్ 28) న ఫేస్‌బుక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. వ్యూ యాజ్ ఫీచర్‌తో హ్యాకర్లు సమాచారాన్ని సేకరించి ఉండవచ్చని భావిస్తోంది. అయితే డేటా దుర్వినియోగంపై స్పష్టత లేదు. కానీ మిగిలిన వినియోగదారుల భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపింది.

భవిష్యత్తులో ఇలా జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఫేస్ బుక్ CEO మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. హ్యాక్ అవుతున్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే 9 కోట్లకు పైగా ఉన్న వినియోగదారులను ఎమర్జెన్సీగా తమ అకౌంట్లను లాగ్ అవుట్ చేయాలని సూచించింది ఫేస్ బుక్.

హ్యాకర్ల దాడి వార్తలు రావడంతో ఫేస్ బుక్ షేర్లు స్టాక్ మార్కెట్లో నష్టాలు చవిచూసింది. ప్రస్తుతానికి లోపాలను సరిదిద్దినట్లు అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com