తీవ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించేది లేదు

- December 19, 2015 , by Maagulf
తీవ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించేది లేదు

ఇంటీరియర్‌ మినిస్ట్రీ తీవ్రవాదాన్ని తుదముట్టించే చర్యల్లో భాగంగా వ్యక్తులు, సంస్థలు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి వుంటే తీవ్రమైన చర్యలు తీసుకోబడ్తుందని వెల్లడించింది. తీవ్రవాదులతోగానీ, తీవ్రవాద సంస్థలతోగానీ ఆర్థిక సంబంధాలు నడిపినా, ఆ సంస్థల అండదండలతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించినా, తీవ్రవాదాన్ని ప్రతిబింబించే చిహ్నాలు కలిగి వున్నా అలాంటివారిని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా తీసుకునే చర్యలకు సంస్థలు, వ్యక్తులు గురికాక తప్పదని ఇంటీరియర్‌ మినిస్ట్రీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌డమ్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ హెజ్‌బోల్లా ఆఫ్‌ లెబనాన్‌, ఫిబ్రవరి 14 యూత్‌ కోలిషన్‌, సరే అల్‌ అష్తర్‌ మరియు సరయా అల్‌ మకవామా టెర్రరిస్టు గ్రూపులుగా నిర్ధారించంది. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ తరఫున తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, గల్ఫ్‌ దేశాల్లో ఎక్కడా తీవ్రవాద ఛాయలు లేకుండా చేయడంలో తమవంతు కృషి చేస్తున్నామని ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. విశ్వ శాంతి కోసం సౌదీ లెడ్‌ ఇస్లామిక్‌ మిలిటరీ అలయన్స్‌ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని మినిస్ట్రీ చెప్పింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com