మేం లేకుంటే మీరు లేరు : డొనాల్డ్ ట్రంప్
- October 03, 2018అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ మిత్ర దేశమైన సౌదీ అరేబియా పట్ల ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం మద్దతు లేకుండా సౌదీ అరేబియాలో రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరని సౌదీ రాజు సల్మాన్‌ను హెచ్చరించారు. 'సౌదీ అరేబియాకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తోంది. వాళ్లు సంపన్నులని మీరు చెప్పొచ్చు. నాకు కూడా రాజు సల్మాన్ అంటే ఇష్టం. కానీ నేను రాజుతో ఇలా చెప్పాను.. మేము మీకు రక్షణ కల్పిస్తున్నాం.. మేము లేకుండా మీరు రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరు.. సైన్యానికి మీరు డబ్బు చెల్లించాల్సిందే' అని ట్రంప్ మిసిసిప్పిలోని సౌత్‌వెస్ట్‌లో జరిగిన ర్యాలీ పేర్కొన్నారు. అయితే ట్రంప్ యంత్రాంగం సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలు నెరుపుతోంది. ఆ ప్రాంతంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేసేందుకు అమెరికాకు సౌదీ ఎంతో ఉపయోగపడుతోంది. గత ఏడాది ట్రంప్ తన తొలి అంతర్జాతీయ పర్యటనకు కూడా సౌదీ అరేబియాకే వెళ్లారు. శనివారం సౌదీ రాజు సల్మాన్, ట్రంప్ సమావేశమయ్యారు.
ట్రంప్‌తో ఆయిల్ మార్కెట్ స్థిరత్వం, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్టు సౌదీ వెల్లడించింది. అయితే, ప్రపంచంలో చమురును అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం సౌదీనే ఒపెక్‌కు అధినేత. కాగా ఇటీవల ముడి చమురు ధరలు అధికంగా పెరుగుతుండడంపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరలను ఆపాలని, ధరలు తగ్గించాలని ట్రంప్ ఇటీవల ఐరాస సమావేశంలో వెల్లడించారు. అలాగే రక్షణ రంగానికి మరింత బడ్జెట్ కేటాయించాలని అమెరికా మిత్రపక్షాలైన జపాన్, దక్షిణ కొరియా, జర్మనీలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







