'ఎన్టీఆర్ కధానాయుడు' విడుదల తేదీ ప్రకటించిన క్రిష్ జాగర్లమూడి.!

- October 03, 2018 , by Maagulf
'ఎన్టీఆర్ కధానాయుడు' విడుదల తేదీ ప్రకటించిన క్రిష్ జాగర్లమూడి.!

ఎన్టీఆర్‌ జీవిత కథని 'ఎన్టీఆర్‌' పేరుతో బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతుంది. దివిసీమలో షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు. "ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు..కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు..జనవరి 9 న #NTRకథానాయకుడు #NTRKathanayakuduOnJan9" అనిదర్శకుడు క్రిష్ ప్రకటించారు. 9న ఎన్టీఆర్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ఓ కారణం వుంది. 1983లో సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగ, ఈ సినిమాలో బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. అలాగే చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com