హైదరాబాద్:ఏసుదాస్ ప్రోగ్రాం.. పోస్టర్ ఆవిష్కరించిన కేటీఆర్
- October 03, 2018
మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్. తన మ్యూజికల్ జర్నీలో ఆయన కొన్ని కోట్ల మంది సంగీత ప్రియులను అలరించారు. తెలుగు ప్రేక్షకులను తన పాటలతో అలరించడానికి హైదరాబాద్‌లో నవంబర్ 11న లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ హీరోయిన్, భరత నాట్యం డాన్సర్ శోభనతో ప్రోగ్రామ్‌లను నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నది . తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తన సినిమాల్లోని హిట్ పాటలను ఈ లైవ్ కనసర్ట్‌లో ఏసుదాస్ ఆలపించనున్నారు. ఈ లైవ్ కాన్సర్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. నవంబర్ 11 రాత్రి ఏడు గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ ధర రూ.1200. ఈ టికెట్స్ బుక్ మై షో ద్వారా లభించనున్నట్లు షో నిర్వాహుకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







