ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు"
- October 04, 2018

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె. యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నికృష్ణ - చిట్టిబాబు లను సత్కరించారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ... ముందుగా ఈ అవకాశం రావడానికి కారణం అయిన కోటేంద్ర గారికి అలానే రఫి గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు" లో ఆరు పాటలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కోలా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలని ఈ “బంగారి బాలరాజు” మూవీ మా మ్యూజిక్ సిట్టింగ్స్ తో స్టార్ట్ అయ్యింది. అప్పట్లో కోటేంద్ర గారికి ఆయన ఫ్రెండ్స్ చాలా మంది కొత్తవారితో వద్దు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తో వెళ్దామని సలహాలు ఇచ్చినా కూడా మాపై నమ్మకం పెట్టి, ఈ చిత్రాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. ఈ మధ్య విడుదలయిన “బంగారి బాలరాజు” ఆడియో సాంగ్స్ తో మా టాలెంట్ నిరూపించుకున్నామని అనుకుంటున్నాము. అని తన ఆనందాన్ని తెలియజేసారు.
మరో మ్యూజిక్ డైరెక్టర్ చిట్టిబాబు రెడ్డిపోగు మాట్లాడుతూ... ముందుగా మా కోటేంద్ర అన్నగారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను, నా టాలెంట్ ని గుర్తించి, ఈ రోజు మాకు సత్కరించేంత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కారణం కోటేంద్ర అన్నగారే. ఈ చిత్రం లో అన్ని పాటలు ఇంత బాగా రావడానికి కోటేంద్ర అన్న అనిత ఓ అనిత సాంగ్ ఎంత బాగా వచ్చిందో నాకు చెప్పి, ఆయన రాసిన లిరిక్స్ వినిపించి ఇలా ఉండాలి పాట అని వివరించి, మా నుండి మంచి పాటలు చేయించుకున్నారు. ఈ రోజు ఆయనతో పాటు మాకు ఒక ప్లాట్ ఫామ్ ని కలిగించారు. ఈ చిత్రం 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. “బంగారి బాలరాజు” చిత్రాన్ని ఆదరించి మన టాలీవుడ్ కి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల అన్నగారికి, మంచి హిట్ తో మమ్మల్ని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఇంత మంచి మ్యూజిక్ ని అందించిన చిన్నికృష్ణ-చిట్టిబాబు లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సత్కారం సాంగ్స్ రిజల్ట్ కు కాదు... వారు పెట్టిన ఎఫర్ట్ కు. అని డైరెక్టర్ కోటేంద్ర తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







