శబరిమల వివాదం: కదం తొక్కుతున్న కేరళ
- October 06, 2018
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రజల మనోభావాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలంటూ కేరళ వ్యాప్తంగా నిరసనలు చేపట్టుతున్నారు అక్కడి ప్రజలు.
ఇటీవలే కేరళ సీఎం పి. విజయన్ శబరిమల తీర్పుపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేదిలేదంటూ ప్రకటించారు. తమ ప్రభుత్వం శబరిమల సందర్శించే మహిళలకు సౌకర్యాలు, రక్షణ కల్పిస్తుందని అన్నారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో సున్నితమైన ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని అధికార, విపక్ష పార్టీలు నిర్ణయించాయి.
అటు కేరళలోని కొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కోర్టు తీర్పును వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన, ర్యాలీల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంతో ఏ సంబంధం లేని మహిళలు చేసిన పిటీషన్‌కు సుప్రీం కోర్టు అనుమతించడం, దీన్ని స్థానిక ప్రభుత్వమూ స్వాగతించడం సరికాదని మహిళలు పేర్కొన్నారు. అటు కొట్టాయంలో శబరిమల ప్రధాన పూజారి కే రాజీవరు మాట్లాడుతూ సంప్రదాయాలు, సంస్కృతులను పరిరక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఉమ్మడిగా ఉద్యమించాలన్నారు.
మరోవైపు తిరువనంతపురంలో ట్రావెన్కోర్ దేవాలయం బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద కొందరు అయ్యప్ప స్వామి భక్తులు ధర్నా చేపట్టారు. దీనిపై రాష్ట్ర మంత్రి కే సురేంద్రన్ మాట్లాడుతూ.. ఈ విషయమై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అధికార సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీజేపీ ఆరెస్సెస్‌కు నిజంగా ఈ అంశంపై చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంటులో శాసనం తేవాలని ఆయన కోరారు. శబరిమల అయప్పస్వామి ఆలయ సంప్రదాయాలను గౌరవించి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పు పునఃసమీక్షించుకోవాలని విశ్వహిందూ పరిషత్ కోరింది. కాగా ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ధర్మకర్తలు సోమవారం ముఖ్యమంత్రి పి. విజయన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారని సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







