ఐటీ రాజధానిలో రెప రెపలాడిన టీడీపీ జెండా

- October 06, 2018 , by Maagulf
ఐటీ రాజధానిలో రెప రెపలాడిన టీడీపీ జెండా

ఐటీ రాజధాని బెంగళూర్‌లో టీడీపీ జెండా రెప రెపలాడింది.. ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి వెళ్లి.. ఐటీ ప్రొఫెషనల్స్‌గా అక్కడ స్థిరపడ్డ టీడీపీ అభిమానులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గు పాల్గొంటున్నారు.. ఏపీలో పార్టీ పటిష్టతకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బెంగళూర్‌లో టీడీపీ ఐటీ ఫోరం 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

జాతీయ పార్టీగా టీడీపీ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు పూర్తిగా విస్తరిస్తున్నాయి.. మొన్న కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టకుండా చేయడంతో టీడీపీ కాస్త సక్సెస్‌ అయ్యింది. అందుకు కారణం అక్కడ టీడీపీకి కాస్త ఆదరణ ఉండడమే.. మరోవైపు ఐటీ నగరంగా పేరొందిన బెంగళూర్‌లో టీడీపీకి భారీగా అభిమానులు ఉన్నారు.. టీడీపీ ఐటీ ఫోరం పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు..

2013లో ప్రారంభమైన ఈ టీడీపీ ఐటీ ఫోరం.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 8 వందల మంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నారా నాయకత్వాన నవ్యాంధ్ర ప్రగతిపై రెండు రోజుల పాటు ఈ అవగాహన సదస్సు కొనసాగనుంది…

టీడీపీలో బెంగళూర్‌ ఐటీ యూత్‌ మంచి పాత్ర పోషిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని.. ఆయన చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి చేరేందుకు బెంగళూర్‌ టీడీపీ ఫోరం బాగా కృషి చేస్తోందన్నారు…

టీడీడీ ఫోరం అద్భుతంగా పని చేస్తోందని ఎమ్మెల్సీ పయ్యావుల ప్రశంసించారు. యువతకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.. వచ్చే ఎన్నికల్లోని ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తమ ఐటీ ఫోరం పనిచేస్తోంది అంటున్నారు బెంగళూర్‌ యూత్‌.. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తమలాంటి వారు ఎందరో ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్‌గా మారడానికి చంద్రబాబే కారణమని.. అందుకే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బెంగళూర్‌ టీడీపీ ఐటీ ఫోరం నేతలు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com