టాలీవుడ్ కు మరో నిర్మాత వారసుడు తెరంగేట్రం
- October 06, 2018
ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. హీరోలు, దర్శక నిర్మాతల కుమారులు హీరోగా పరిచయమై ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత కుమారుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయన తన కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి డెబ్యూ చిత్రాన్ని కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివరాజ్ కనుమూరి తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. శివరాజ్ చెప్పిన కథ రాజ్ కందుకూరికి బాగా నచ్చడంతో ఈ స్టోరీతో తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తే.. బాగుంటుందని రాజ్ కందుకూరి భావిస్తోన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







