సలమానియాలో బిల్డింగ్ కూలి నలుగురు మృతి
- October 10, 2018
బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగా సలమానియాలోని ఓ భవనం కుప్ప కూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో ముగ్గురి మృతదేహాల్ని వెలికి తీశారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ వుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రీమియర్ పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. ఇంటీరియర్, లేబర్, సోషల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీస్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రిన్స్ ఖలీఫా.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







