బిగ్‌బి బర్త్‌డే సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల
- October 10, 2018
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 76వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కీలక పాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలోని మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో ఆయన నరసింహారెడ్డికి గురువుగా నటించారు. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువు పాత్రలో అమితాబ్ ఒదిగిపోయారు. ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.45కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ యుద్ధ సన్నివేశం ఒళ్లు గగురుపొడిచేలా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. జార్జియాలో షూటింగ్ ముగిసిన తర్వాత మరోసారి హైదరాబాద్‌లో షెడ్యూల్ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. 'సైరా'లో అమితాబ్, నయనతార, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







