అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!!
- October 10, 2018
టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్ సమంత, నాగ చైతన్య పెళ్ళి తర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.. 'నిన్నుకోరి ' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు.. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది..
నటీనటులు :
నాగ చైతన్య, సమంతా, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ మరియు రాజశ్రీ నాయర్
సాంకేతిక నిపుణులు :
రచన మరియు దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్ బ్యానర్
సంగీతం: గోపీ సుందర్
డిఓపి : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్
PRO: వంశీ శేఖర్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







