హిట్ అండ్ రన్: 3 గంటల్లోనే డ్రైవర్ అరెస్ట్
- October 17, 2018
రస్ అల్ ఖైమా పోలీసులు, అత్యంత వేగంగా స్పందించి హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. కేవలం మూడు గంటల్లోనే బైకర్‌ని అరెస్ట్ చేయడం ద్వారా పోలీసులు తమ సమర్థతను ఇంకోసారి చాటి చెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారకుడైన నిందితుడు, ప్రమాదం జరిగాక అక్కడి నుంచి పారిపోయినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి చెప్పారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అలర్ట్ అయిన కంట్రోల్ ఆపరేషన్స్ రూమ్, సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్ పారా మెడిక్స్‌ని పంపించడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యింది నిందితుడి కోసం. మూడు గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







