జిటెక్స్లో ప్రధాన ఆకర్షణగా ఎగిరే కార్లు
- October 17, 2018
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ - జిటెక్స్లో ఈ ఏడాది ఎగిరే కార్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేలాది మంది సందర్శకులు, ఈ ఈవెంట్లో పాలుపంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఇండస్ట్రియలిస్ట్స్ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వీటిల్లో ప్రధాన ఆకర్షణగా ఎగిరే కారు నిలుస్తోంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా కారులో గాలిలో ఎగిరే అవకాశం ఈ ఎగిరే కారు కల్పిస్తుంది. ఆడి మరియు ఎయిర్ బస్ సంయుక్తంగా ఈ ఎగిరే కారుని తయారు చేశాయి. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కోసం ఎగిరే కారు తయారు చేయాలన్న ఐడియా నుంచి ఈ సాంకేతిక అద్భుతం సాధ్యమయినట్లు నిర్వాహకులు తెలిపారు. నేల మీద నడిచేలా, గాల్లో ఎగిరేలా దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







