రష్యాలో బాంబు పేలుడు, 18 మంది మృతి

- October 17, 2018 , by Maagulf
రష్యాలో బాంబు పేలుడు, 18 మంది మృతి

మాస్కో: రష్యాలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని కెర్చ్‌.. క్రెమియా టెక్నికల్ కాలేజీలో చోటు చేసుకుంది. సంఘటన జరిగిన ప్రాంతం రష్యా బ్రిడ్జి నిర్మించిన క్రెమియా - రష్యా మధ్య ఉంది.

విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు

తొలుత దీనిని గ్యాస్‌ సిలిండర్‌ పేలుడుగా భావించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా పేలుడుకి పాల్పడినట్లు రష్యాకు చేందిన నేషనల్‌ గార్డ్స్‌ ఆ తర్వాత ప్రకటించింది. పేలుడుపై అధికార ప్రతినిధి మాట్లాడారు. ఇది ఐఈడీ కారణంగా జరిగిన పేలుడుగా గుర్తించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.

ఈ పేలుడు కారణంగా మృతి చెందిన వారిలో అత్యధిక మంది విద్యార్థులే. గుర్తుతెలియని సాయుధుడు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర విభాగాలు వెంటనే అక్కడకు తరలి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com