ఇంటర్ ఉత్తీర్ణతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు..
- October 24, 2018
గ్రేడ్ సి & డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఎగ్జామినేషన్‌కు ప్రకటన వెలువడింది.
అర్హత: పన్నెండో తరగతి/ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2019 జనవరి 1 నాటికి సీ గ్రేడ్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల వరకు, డీ గ్రేడ్ ఉద్యోగాలకు 18 నుంచి 27 మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.
పరీక్ష తేదీలు: 2019 ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు
పరీక్ష విధానం: పరీక్ష సమయం 2 గంటలు.
ఇందులో మూడు పార్టులు ఉంటాయి.
పార్ట్ 1 లో జనరల్ ఇంటిలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.
పార్ట్ 2 లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.
పార్ట్ 3లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పార్ట్ 3 మినహా అన్ని ప్రశ్నలను ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 19.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను కూడా ఎస్ఎస్సి భర్తీ చేయనుంది.
పోస్టులు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనిమర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రద్యాపక్.
అర్హత: ఉద్యోగ నిబంధనలను అనుసరించి డిగ్రీ, పీజీ, బీఎడ్, డిప్లొమా, సర్టిఫికెట్
కోర్సులు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
పరీక్ష వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో ట్రాన్స్లేషన్, ఎస్సే రైటింగ్ ఉంటాయి.
పేపర్ 1 పరీక్ష తేదీ: 2019 జనవరి 12
పేపర్ 2లో ట్రాన్స్లేషన్, ఎస్సే పేపర్2 పరీక్షను తరువాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 19
వెబ్సైట్: https://ssc.nic.in
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్‌లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







