ఐక్యరాజ్యసమితిలో సరోద్ బాణీలు.. ఆకట్టుకున్న ఉస్తాద్ అంజద్‌ఖాన్‌

- October 24, 2018 , by Maagulf
ఐక్యరాజ్యసమితిలో సరోద్ బాణీలు.. ఆకట్టుకున్న ఉస్తాద్ అంజద్‌ఖాన్‌

న్యూయార్క్: భారతీయ సరోద్ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్.. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చారు. తన కుమారులు అమన్ అలీ బంగేశ్, అయ్యన్ అలీ బంగేశ్‌లు కూడా అంజద్ ఖాన్‌తో పాటు సరోద్ వాయించారు. యూఎన్ డే కన్సర్ట్-2018 వేడుకల్లో భాగంగా ఉస్తాద్ అంజద్ ఖాన్ ఈ ప్రదర్శన ఇచ్చారు. శాంతి, అహింసా సాంప్రదాయలు అన్న థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ హాల్‌లో ఈ సంగీత విభావరి సాగింది. భారత జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అహింస చరిత్రను మార్చేస్తుందని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com