60 పిల్స్ హెరాయిన్‌తో పట్టుబడ్డ వలసదారుడు
- October 26, 2018
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఓ వలసదారుడి నుంచి 60 హెరాయిన్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ - మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఈ స్మగ్లింగ్‌ని అడ్డుకోవడంలో సఫలమయ్యింది. ఆసియా జాతీయుడైన నిందితుడు, తన పొట్టలో నార్కోటిక్ పిల్స్‌తో మస్కట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతని పొట్టలో నార్కోటిక్ పిల్స్ వున్నట్లు గుర్తించారు. అత్యంత చాకచక్యంగా నిందితుడి పొట్ట నుంచి నార్కోటిక్ పిల్స్‌ని బయటకు తీశారు. నిందితుడిపై కేసులు నమోదు చేశారు. నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







