ఫిట్నెస్ మోడ్‌లోకి దుబాయ్ రెసిడెంట్స్
- October 26, 2018
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ ప్రారంభం కావడంతో దుబాయ్‌లో ఎక్కడ చూసినా ఫిట్నెస్ పట్ల అవగాహనతో, ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నవారే కన్పిస్తున్నారు. దుబాయ్ ఫెస్టివల్ సిటీ వద్ద దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ ఈవెంట్ జరిగింది. వీకెండ్ కార్నివాల్ ఓపెనింగ్ సందర్భంగా మాల్ వద్ద భారీగా జనం గుమికూడారు. రెండ్రోజులపాటు జిగే ఈ ఈవెంట్లో ఫన్ యాక్టివిటీస్, టీమ్ మరియు ఇండివిడ్యువల్ స్పోర్ట్స్, స్టేజ్ యాక్ట్స్, హోస్ట్ ఈవెంట్స్ దుఆయ్ వాసుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా వుంటే 30 రోజులపాటు సాగే సిటీ వైడ్ ఫిట్నెస్ మూమెంట్ 'ఫిట్నెస్ ఛాలెంజ్' షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్) మెసేజ్‌తో ప్రారంభమయ్యింది. ఉదయాన్నే ఈ మెసేజ్‌ని అందుకున్నవారిలో చాలామంది ఫిట్నెస్ ఛాలెంజ్‌లో తాము సైతం అంటూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈ ఇనీషియేటివ్ ఫిట్నెస్ పట్ల ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెంచుతోందని దుబాయ్ రెసిడెంట్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







