విమానం కొనలేక 'విమాన హోటల్' నిర్మించాడు

- October 29, 2018 , by Maagulf
విమానం కొనలేక 'విమాన హోటల్' నిర్మించాడు

ఈశాన్య చైనాలో పంట పొలాల మధ్య ఎయిర్‌బస్‌ ఏ320 ఘుమఘుమలాడే రుచులతో సిద్ధమవుతోంది. చైనాకు చెందిన రైతు 'జూ యూ', తన చిన్న నాటి కలను నెరవేర్చుకునేందుకు గోధుమ పంటల మధ్య 'విమాన హోటల్‌'ను నిర్మిస్తున్నాడు. ఇందుకోసం 2.6 మిలియన్‌ యువాన్లు(దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నాడు. నిజమైన ఎయిర్‌బస్‌ 320 కొలతలతో, రెక్కలు, కాక్‌పిట్‌, ఇంజన్‌ సహా అన్ని భాగాలకు సంబంధించిన పక్కా సమాచారం సేకరించి నిజమైన విమానాన్ని తలపించేలా ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇందుకోసం సుమారు 60 టన్నుల ఉక్కును వినియోగించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com