కమల్ హాసన్ ‘క్షత్రియపుత్రుడు’ రీమేక్ లో సూర్య
- October 31, 2018
సింగం సూర్య ఈమద్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలపై కూడా తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకు కారణం ఆయా సినిమాల కాస్టింగ్ తో పాటు, డైరెక్టర్ల క్రేజ్ కూడా ఒకటి. ప్రస్తుతం సూర్య నటించిన ఎన్.జి.కె చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ మూవీ రాకముందే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో మోహన్ లాల్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
38వ చిత్రంగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేశాడు సూర్య. కమల్ హాసన్ నటించి, నిర్మించిన దేవరమగన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు సూర్య. అందులో కమల్ హాసన్ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. ఇక కమల్ హాసన్ తండ్రి పాత్ర పోషించిన శివాణీ గణేషన్ రోల్ లో, కమల్ హాసన్ నటించనున్నాడు.
ఈ మూవీ అప్పట్లో క్షత్రియపుత్రుడుగా తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాని సూర్య అదే పేరుతో రీమేక్ చేయబోతున్నాడు. తెలుగులో క్షత్రియ పుత్రుడు 2 గా రాబోతుంది. సో..సూర్య ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హల్ చల్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







