కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, 25 మంది మృతి
- October 31, 2018
అఫ్గానిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరా ప్రావిన్స్‌లో ఓ సైనిక విమానం కుప్పకూలి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరా ప్రావిన్స్‌లోని అనార్ దరా జిల్లా నుంచి హెరత్ ప్రావెన్స్‌కు బయల్దేరిన ఓ సైనిక విమానం బుధవారం ఉదయం 9.10 గంటల సమయంలో కూలిపోయింది. అనార్ దరా బేస్ నుంచి విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో విమానంలో '207 జాఫర్ మిలిటరీ కార్ప్స్' అధికారులతో పాటు ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యులు మొత్తం 25 మంది ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని జాఫర్ మిలిటరీ కార్ప్స్ అధికార ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు. మృతుల్లో ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ చీఫ్ ఫరీద్ భక్తావర్, 207 జాఫర్ మిలిటరీ కార్ప్స్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ నెమతుల్లా ఖలీల్ కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







