ఎఫ్టీఐఐ చైర్మన్ పదవికి అనుపమ్ ఖేర్ రాజీనామా
- October 31, 2018
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) చైర్మన్ పదవికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బుధవారంనాడు రాజీనామా చేశారు. అంతర్జాతీయ టెలివిజన్ షోతో సహా తనకున్న బిజీ కమిట్మెంట్ల కారణంగా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. 'ప్రతిష్ఠాత్మక ఎఫ్టీఐఐ చైర్మన్‌గా పనిచేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ఎంతో గొప్పు అనుభవం సంపాదించే అవకాశం దొరికింది. అయితే అంతర్జాతీయ కమిట్మెంట్లు ఉండటంతో తగిన సమయాన్ని సంస్థకు కేటాయించలేకపోతున్నాను. ఆ కారణంగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అంధరికీ ధన్యవాదాలు' అని ఆ ట్వీట్లో అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. కాగా, సంస్థను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ విద్యార్థుల నుంచి విమర్శల దుమారం రేగడంతో గజేంద్ర చౌహాన్ స్థానంలో 2017 అక్టోబర్ 11న ఎఫ్టీఐఐ కొత్త చైర్మన్‌గా అనుపమ్ ఖేర్‌ను నియమించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







