ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త..!

- October 31, 2018 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త..!

*సీఆర్‌డీఏ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజల కోసం చేపడుతున్న గృహ నిర్మాణం ప్రాజెక్టుపై సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

AD : టీవీ5 న్యూస్‌ అప్‌డేట్స్‌ మీ వాట్సాప్‌లో పొందడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి
   

*ప్రజా గృహ నిర్మాణ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు : ముఖ్యమంత్రి

*రాజధానిలో చేపడుతున్న ఈ మొట్ట మొదటి ప్రాజెక్టును అత్యుత్తమ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలి : ముఖ్యమంత్రి

*నవంబర్ 9నుంచి ప్రజలకు అందుబాటులో వెబ్ పోర్టల్, అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.

*అమరావతి హ్యాపీనెస్ట్ అనే పేరుతో ప్రాజెక్టు నిర్మాణం.

*దీనికి సీ ఫ్యూచర్.. బీ ఫ్యూచర్ అనే ట్యాగ్‌లైన్.

*అమరావతి హ్యాపీనెస్ట్‌పై ప్రజలలో ఇప్పటికే ఆసక్తి పెరిగింది : ముఖ్యమంత్రి

*ప్రజల అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పూర్తిచేయాలి: ముఖ్యమంత్రి

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడి.. వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా సచివాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయండి : అధికారులకు సీయం ఆదేశాలు

*సొంత గృహాలు కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల కోసం హ్యాపినెస్ట్ తరహాలో గృహ నిర్మాణ ప్రాజెక్టు: ముఖ్యమంత్రి

* ఈ ప్రాజెక్ట్ కోసం నేలపాడు సమీపంలో 14.46 ఎకరాల భూమి కేటాయింపు.

*మొత్తం 12 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్రతిపాదన.

*తొలి దశలో ఆరు టవర్లలో 600 ఫ్లాట్లు జీ+18 విధానంలో నిర్మాణం.

*చ.అడుగు ధర సుమారు రూ.3,500

*ఆరు కేటగిరీలుగా ప్లాట్ల పరిమాణాలు.

*నవంబర్ 9 నుంచి అందుబాటులోకి వెబ్ పోర్టల్.

*పోర్టల్‌లో ఒక్కొక్క ఫ్లాట్‌ను నిశితంగా పరిశీలించుకునేందుకు వీలుగా త్రిడీ గ్రాఫిక్స్

*మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం అనే విధానంలో దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com