నెల రోజులపాటు షార్జా కోర్నిచ్ రోడ్ పాక్షిక మూసివేత
- November 01, 2018
షార్జా:రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ - షార్జా, బుహౌరాహ్ కోర్నిచ్‌లో బస్సుల కోసం డెడికేట్ లైన్స్ నిర్మిస్తుండడంతో, పాక్షికంగా నెల రోజులపాటు ఈ రోడ్డులో మూసివేత అమల్లో వుంటుంది. సెంట్రల్ మార్కెట్ లేదా ఇత్తిహాద్ పార్క్ వెళ్ళాలనుకునే వాహనదారులు, ఈ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా వుంటుంది కాబట్టి, ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిది. రెండు నెలలపాటు ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతాయి. ఆర్‌టిఎ షార్జా రోడ్స్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ టెండర్స్ డైరెక్టర్ ఇంజనీర్ షేకా అల్ జువైన్ మాట్లాడుతూ, పేవ్‌మెంట్ టైల్స్, అస్ఫాల్ట్ లేయర్స్ ఈ మార్గంలో రీప్లేస్ చేయాల్సి వుంటుందని తెలిపారు. 4 మిలియన్ దిర్హామ్ ఖర్చుతో ఈ పనులు పూర్తి చేయనున్నారు. షార్జా పోలీస్‌తో కలిసి ఆర్‌టిఎ షార్జా ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనదారుల్ని పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. రోడ్ సైన్స్, సైన్ బోర్డ్స్‌ని అనుసరించి వాహనాలు నడపాల్సి వుంటుంది వాహనదారులు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







