తొమ్మిదేళ్ళ చిన్నారి మృతి: ఫ్లూ వ్యాక్సిన్‌ తప్పనిసరి

- November 01, 2018 , by Maagulf
తొమ్మిదేళ్ళ చిన్నారి మృతి: ఫ్లూ వ్యాక్సిన్‌ తప్పనిసరి

దుబాయ్‌:దుబాయ్‌లోని అల్‌ ఖౌజ్‌ లో గల జెమ్స్‌ అవర్‌ ఓన్‌ ఇండియన్‌ స్కూల్‌ విద్యార్థిని తొమ్మిదేళ్ళ చిన్నారి అమీనా అన్నమ్‌ షరీఫ్‌ (గ్రేడ్‌ 4 చదువుతున్న విద్యార్థిని) ఫ్లూ కారణంగా చనిపోయింది. ఆమె అంత్యక్రియల్ని అల్‌ కోజ్‌ సెమిటరీలో నిర్వహించారు. అమీనాకు తల్లి, తండ్రి, ముగ్గురు చెల్లెళ్ళు వున్నారు. అక్టోబర్‌ 20 నుంచి చిన్నారి ఫ్లూ బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. క్లినిక్‌కి తీసుకెళ్ళి వైద్య చికిత్స అందించామనీ, ఇంతలోనే ఆమె ప్రాణం కోల్పోయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తొలుత చికిత్స అనంతరం కోలుకుందనీ, అంతలోనే ఆమెకు వాంతులు అవడం, పరిస్థితి విషమించడంతో.. శరీరంలోని ముఖ్యమైన భాగాల పనితీరు మందగించాయి. అమీనాను వెంటనే అల్‌ జాలియా చిల్డ్రన్స్‌ స్పెసాలిటీ హాస్పిటల్‌కి తరలించగా, వెంటిలేటర్‌పై వారం రోజులపాటు వైద్య చికిత్స అందించారు. అయినా ఆమె ప్రాణాల్ని వైద్యులు కాపాడలేకపోయారు. ఇది చాలా రేర్‌ కేసు అనీ, కొన్ని ఫ్లూ లక్షణాలు తర్వాత ఇబ్బందికరంగా మారతాయని చెప్పారు. అయితే ఫ్లూ కారణంగా మరణాలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. ఫ్లూ లక్షణాలు కన్పించినవెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. హై రిస్క్‌ పేషెంట్స్‌, ముందస్తుగానే ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సి వుంటుంది. జలుబు, జ్వరం, దగ్గు తగ్గకపోతే ప్రమాదకరమైన ఫ్లూగా నిర్ధారించాల్సి వుంటుంది. ప్రత్యేకించి చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో అశ్రద్ధ ప్రమాదకరం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com