విమానప్రయాణికుడి వద్ద బులెట్ల కలకలం
- November 01, 2018
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద బులెట్లు లభించడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి రియాద్ వెళుతోన్న అలీబీన్ ఉస్మాన్ అనే ప్రయాణికుడి నుంచి CISF సిబ్బంది రెండు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అలీబీన్ ఉస్మాన్ గత కొంత కాలంగా రియాద్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఉస్మాన్ తిరిగి ఈ రోజు రియాద్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అయితే.. ఉస్మాన్ లగేజ్ బ్యాగ్ చెక్‌చేసిన ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బందికి 10.98 సైజ్‌లో ఉన్నరెండు లైవ్ బులెట్లు దొరికాయి. నిందితుడు ఉస్మాన్‌పై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







