దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో బాలికపై లైంగిక వేధింపులు
- November 01, 2018
దుబాయ్:ఓ కార్మికుడు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో, పదేళ్ళ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. స్పెషల్ నీడ్స్ బాలికను వీల్ ఛెయిర్లో వుండగా నిందితుడు వేధించినట్లు, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ రికార్డ్స్‌లో ప్రస్తావించారు. నిందితుడి వయసు 42 ఏళ్ళు (భారతదేశానికి చెందిన వ్యక్తి) కాగా, బాధితురాలు (అమెరికన్ బాలిక) వయసు పదేళ్ళు. ఏకంగా నాలుగుసార్లు నిందితుడు, బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అభియోగాలు మోపబడ్డాయి. అయితే, కావాలని తాను వేధింపులకు గురిచేయలేదనీ, ఆమెకు సహాయం చేశాను తప్ప అసభ్యకరంగా ప్రవర్తించలేదని నిందితుడు, కోర్టుకు విన్నవించాడు. అయితే, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫఙర్యాదు చేసినట్లు ఎయిర్‌పోర్ట్‌కి చెందిన లెబనీస్ సెక్యూరిటీ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ కేసులో తీర్పు నవంబర్ 22న వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







