'రోబో 2.0' ట్రైలర్
- November 03, 2018
సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఒక్క తమిళంలోనే కాక ఇండియా మొత్తం క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.రజనీ సినిమాలు విడుదల అవుతుంటే బాలీవుడ్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు.ఇక తెలుగులో కూడా రజనీకాంత్‌కు మంచి మార్కెట్ ఉంది.రజినీ సినిమాలు విడుదల రోజున కార్పొరేట్ కంపెనీలు సైతం ఆ రోజున సెలవు ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రజినీ నటించిన గత రెండు సినిమాలు సరైన విజయాలు సాధించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు తలైవా అభిమానులు.రోబో 2.0 కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.రెండు సంవత్సరాలు క్రితం మొదలైన 2.0 సినిమాకు స్ఠార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు సూపర్ రెస్పన్స్ వచ్చింది.
ఈ రోజు(శనివారం) రోబో 2.0 ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రపంచం మొత్తం టెక్నలజీ చూట్టు తిరుగుతు వాతవారణాన్ని లెక్క చేయకపోవడంతో ప్రజలపై ప్రతికారం తీర్చుకునే క్యారెక్టర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. సెల్ ఫోన్ వాడుతున్న వారందరు శత్రువులుగా భావించిన విలన్ వారిపై దాడికి తిగుతాడు. అక్షయ్ కుమార్ తన దగ్గర ఉన్న అద్బుత శక్తులతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాడు..అక్షయ్‌ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.దీంతో చిట్టి ది రోబోని మళ్లీ బాహ్య ప్రపంచలోకి తీసుకు వచ్చి ప్రజలను కాపాడామంటారు. ఇక సినిమాలో వీరిద్దరి(అక్షయ్- రజినీ) మధ్య జరిగే సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు శంకర్.రోబోకి ధీటుగా ఉండే మరో క్యారెక్టర్ డిజైన్ చేయడంలో శంకర్ సక్సెస్ సాధించారు.ఇక విలన్‌గా అక్షయ్ పాత్ర సినిమాకే హైలెట్ కానుందని ఈ ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.
ఇక రజినీ విషయానకి వస్తే ఇంత వయస్సు వచ్చిన ఏమాత్రం వన్నె తగ్గని నటనతో రెచ్చిపోతున్నారు.చిట్టిగా రజనీ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ కానుంది. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అమీ జాక్సన్ కూడా రోబో అని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అర్థం అవుతుంది.ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌లనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఎలా ఉంటుందో ఊహాకే అందడం లేదు.ఇక సినిమాలో గ్రాఫిక్స్‌కు ఎక్కవుగానే ఖర్చు పెట్టారు.రోబో 2.0 ఇండియన్ సినిమాను మరో లెవల్‌కి తీసుకువెళ్తందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సినిమాను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







