పౌరుడ్ని దోచుకున్న వలసదారుడి అరెస్ట్
- November 03, 2018
మస్కట్: ఆఫ్రికా జాతీయుడైన ఓ నిందితుడు, ఒమనీ పౌరుడి వద్ద నుంచి 160,000 దిర్హామ్‌లు దోచుకున్న నేరానికిగాను, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. డబ్బుని రెండింతలు చేస్తానంటూ మాయమాటలు చెప్పిన నిందితుడు, బాధితుడ్ని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ నేతృత్వంలోని క్రిమినల్ ఎంక్వయిరీ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ - అల్ దహిరా గవర్నరేట్ నిందితుడ్ని విలాయత్ ఆఫ్ ఇబ్రిలో పట్టుకోవడం జరిగింది. రెట్టింపు డబ్బు ఇస్తానని నిందితుడు చెప్పడంతో, గుడ్డిగా నమ్మిన బాధితుడు నిందితుడికి 160,000 దిర్హామ్‌లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫ్రాడ్‌కి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్స్ తాలూకు బ్యాంక్ రిసీప్ట్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







