పెరిగిన బంగారం ధరలు
- November 03, 2018
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పసిడికి డిమాండ్ పెరిగిపోవడంతో ధరలు కూడా పెరిగిపోతున్నాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయలు పెరిగి రూ.32,650కి చేరుకుంది. ఓవర్సీస్‌లో బంగారం ధరలు పడిపోయినప్పటికీ మనదేశంలో మాత్రం పండగ కారణంగా పెరిగిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పోల్చితే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి రూ.39,530గా ఉంది.
బంగారం ధరలు స్వల్పంగా పెరగడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు వివరించారు. దీపావళి పండగ కారణంగా పసిడికి డిమాండ్ ఏర్పడటంతో వ్యాపారులు విపరీతంగా బంగారును కొనుగోలు చేశారని చెప్పారు. అయితే మార్కెట్లు బలహీనపడటంతో బంగారు ధరలు పెరిగాయని వారు చెబుతున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో 99.9 ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ. 32.650 ఉండగా... 99.5 స్వచ్ఛమైన బంగారం ధర తులం రూ.32,500గా ఉంది. రెండిటి మధ్య తేడా రూ. 150గా ఉంది. ఇదిలా ఉంటే 8గ్రాముల బంగారం ధర రూ.24,900గానే ఉండి ఎలాంటి పెరుగుదల నమోదు చేయలేదు. ఇక వెండి ధర శుక్రవారంతో పోలిస్తే రూ.30 పెరిగింది. కిలో వెండి ధర రూ.39,530గా ఉంది. ఇక వెండి నాణేలు కొనుగోలు, అమ్మకాల విలువ మారలేదు. 100 వెండి నాణేల ధర కొనుగోలు చేయాలంటే రూ.76వేలు ఉండగా.. అదే అమ్మాలంటే రూ.77వేలుగా ఉంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!