బహ్రెయిన్‌లో తమిళ్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌

- November 03, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో తమిళ్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌

తమిళ భాష, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఇండియన్‌ క్లబ్‌ వద్ద కల్చరల్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు. బహ్రెయిన్‌ తమిళ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ, ఇండియన్‌ క్లబ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మలేసియా పెనాంగ్‌ స్టేట్‌ చీఫ్‌ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ డాక్టర్‌ పి.రామస్వామి ఈ కార్యక్రమానికి గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా హాజరయ్యారు. భారత పార్లమెంటు మాజీ సభ్యుడు వైకో, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా, మలేసియాతోపాటు పలు గల్ఫ్‌ దేశాల్లోని తమిళ లిటరరీ ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్‌ రామస్వామి మాట్లాడుతూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా వుందన్నారు. వైకో మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం తమిళనాడుకు వుందని చెప్పారు. తమిళ లిటరేచర్‌లో బహ్రెయిన్‌ గురించి పలు సందర్భాల్లో ప్రస్తావన వుందని వైకో తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com