స్మగ్లింగ్ యత్నం: వలసదారుడికి జైలు
- November 08, 2018
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, బంగ్లాదేశీ జాతీయుడొకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేసిన అధికారులు, అతని నుంచి కిలోగ్రామ్ మరిజువానా, 900 నార్కోటిక్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరిజువానాని స్మోక్ చేసేందుకు ఉపయోగించే ఓ వుడెన్ టూల్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైలు శిక్ష పూర్తయిన అనంతరం నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఇటీవల తన దేశానికి వెళ్ళిన తాను అక్కడ ఐదు రోజులు వున్నాననీ, అక్కడే మరిజువానాని స్మోక్ చేశాననీ, అక్కడ తనను కలిసిన ఓ వ్యక్తి, డ్రగ్స్‌ని తీసుకెళ్ళాల్సిందిగా కోరుతూ, 200 బహ్రెయినీ దినార్స్ ఇచ్చాడని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







