దుబాయ్ లో దీపావళి
- November 08, 2018



దుబాయ్: దీపావళి..ఈ పండగ అంటే పిల్లలతో సమానంగా పెద్దలు కూడా ఎంతో ఆనందంతో దీపాలు పెట్టి బాణాసంచా కాల్చి ఉల్లాసంగా జరుపుకునే పండగ. భారతదేశంలో దీపావళి జరుపుకోవటం ఎంత ఆనందదాయకమో అంతకంటే రెట్టింపు ఉంత్సాహం విదేశాల్లో జరుపుకోవటం. యూఏఈ లోని దుబాయ్ టూరిజం వారు దుబాయ్ లోని 'అల్ సీఫ్' లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో ఎందరో తెలుగు వారు పాల్గొన్నారు.




దుబాయ్ లోని తెలుగు ఆడపడుచులు ముందుగా తమ ముంగిళ్ళల్లో రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్ది, లక్ష్మి పూజలు చేసుకొని, ఎంతో అందంగా ముస్తాబై 'అల్ సీఫ్' లో తమ కుటుంబ మరి స్నేహితులతో కలిసి ఎంతో ఉల్లంసగా దీపావళి జరుపుకున్నారు. దుబాయ్ ప్రభుత్వం ఇలా మన సంప్రదాయాలకు విలువ ఇచ్చి సంబరాలు చేసుకోవటం అభినందించదగ్గదని మరియు అందులో పాల్గొనటం ఆనందగంగా ఉందని దుబాయ్ ప్రభుత్వానికి ధనవ్యవాదాలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







