విడుదలకు రెడీ అవుతున్న 'ఉన్మాది'
- November 12, 2018
ప్రవీణ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్మాది'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ - "ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. గుంటూరు జిల్లాలోని నకరికల్లు గ్రామంలో పచ్చని పొలాలు మధ్య ముప్పై రోజుల పాటు జరిగిన సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేశాం. 8ఫైట్స్, 5 సాంగ్స్‌తో సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. అలాగే పాటల విడుదల తేదీ కూడా ప్రకటిస్తాం" అన్నారు. టైటిల్ పాత్రలో ఎన్.ఆర్.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు. అల్లు రమేశ్, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్‌పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమెరా: దంటు వెంకట్, ఎడిటర్: కె.ఎ.వై.పాపారావు, ఫైట్స్: దేవరాజ్, కొరియోగ్రఫీ: సామ్రాట్, జోజో, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి, క్రియేటివ్ డైరెక్టర్ : రాఘవ, నిర్మాత: ఎన్.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.ఆర్.రెడ్డి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







