స్కూల్లో బిర్యానీ విక్రయం: తల్లిదండ్రుల ఆందోళన
- November 14, 2018
ఫుజైరః:స్కూల్ క్యాంటీన్లో బిర్యానీ అమ్మకాల పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి లంచ్ బాక్స్‌లో బిర్యానీని గమనించిన తల్లి అస్మా మొహమ్మద్ తన కుమారుడ్ని ప్రశ్నించగా, బ్రేక్ ఫాస్ట్‌గా తాను బిర్యానీ కొనుగోలు చేసినట్లు తన తల్లికి విద్యార్థి చెప్పాడు. ఆ విషయాన్ని ఆస్మా మొహమ్మద్ స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ క్యాంటీన్లలో నిబంధనలకు లోబడి రైస్ డిష్‌లకు అనుమతిస్తోంది. అయితే బిర్యానీ కారణంగా, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. తన కుమారుడికి డైజెస్టివ్ డిజాస్టర్స్ వున్నాయి గనుక, బిర్యానీ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని బాధిత విద్యార్థి తల్లి ఆస్మా మొహమ్మద్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఫుజారియా ఎడ్యుకేషన్ సూపర్ విజన్ డిపార్ట్మెంట్ హెడ్ మిష్ అల్ అల్ ఖాదిమ్ చెప్పారు. చాలా ప్రైవేట్ స్కూళ్ళలో బిర్యానీ 10 దిర్హామ్‌లకే లభిస్తోంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







