తెలంగాణ:కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
- November 14, 2018
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ 10 మందితో రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది.
నియోజకవర్గ స్థానాల వారీగా చూస్తే ... మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఖానాపూర్- రమేష్ రాథోడ్, ఖైరతాబాద్- దాసోజు శ్రవణ్, సిరిసిల్ల- కెకె. మహేందర్‌రెడ్డి, జూబ్లీహిల్స్- విష్ణువర్దన్‌రెడ్డి, పాలేరు- ఉపేందర్‌రెడ్డి, ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, షాద్‌నగర్- సి. ప్రతాప్‌రెడ్డి, భూపాలపల్లి- గండ్ర వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి- జాజాల సురేందర్‌లకు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, రెండో జాబితాలోనూ ప్రముఖుల పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసిన రెండో జాబితాలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, రెండు బీసీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులకు సీట్లు ఖారారు చేయగా, ఆరు స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







