ఒకేసారి 15 మొబైల్స్‌లో...

- November 14, 2018 , by Maagulf
ఒకేసారి 15 మొబైల్స్‌లో...

చైనా:రామ,కృష్ణ అని కూర్చొని భజన చేసుకునే టైంలో ఓ తైవాన్‌ తాత అద్భుతం సృష్టించాడు. ప్రపంచాన్ని ఔరా అనిపించేలా చేశాడు. సైకిల్‌కు 15 మెుబైల్స్‌ను పెట్టి వివాదస్పద పోకేమెన్‌ గో గేమ్‌ ఆడుతూ చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాడు.స్మార్ట్ ఫోన్ ఆధారితమైన ఈ గేమ్‌లో యానిమేటెడ్ పాత్రలను పట్టుకోవడం ఆటలో ఓ భాగం. పెద్దాయన సైకిల్‌పై తిరుగుతూగేమ్‌ రౌండ్లను సునాయాసంగా పూర్తి చేస్తున్నాడు. యుక్త వయస్కులకే కష్టమైన ఈ ఆటను 70 ఏళ్ల తాత సైకిల్‌‌పై 15 మెుబైల్స్‌ పెట్టుకుని గేమ్ ఆడుతూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పెన్షనర్‌ అయిన ఆ తాత పేరు సాన్‌ యూయాన్‌. 15 మొబైల్స్‌ను పెట్టుకునే విధంగా సైకిల్‌ హ్యాండిల్‌ తయారు చేసి.. సైకిల్‌కు మొబైల్స్‌కు బ్యాటరీ బ్యాకప్‌ని అమర్చుకొని నగరమంతా తిరుగుతూ గేమ్ ఆడుతున్నాడు.

ఈ తాత తైవాన్‌లో సెలబ్రెటిగా మారిపోయాడు. పోకేమెన్‌ గో తాతగా ఫేమస్‌ అయ్యాడు.ఒక్క ఫోన్‌తో మొదలైన తన ఆట.. నెల తిరిగేసరికి మూడు, ఆ తరువాత ఆరు, తొమ్మిది నుంచి 15కు చేరిందని ఈ తైవాన్‌ తాత రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 2016లో ఈ గేమ్ తన మనవడు తనకు చూపించాడని ఈ క్రెడిట్‌ అంతా అతనిదేనని చెప్పుకొచ్చాడు. ప్రాణాంతకమైన ఈ పోకేమెన్‌ గో గేమ్‌ను పలు దేశాలు నిషేధించాయి. గేమ్‌లో భాగంగా ఇందులోని అదృశ్య పాత్రలను పట్టుకోవడం కోసం ఎతైన భవనాలు,కొండలపైకి, రోడ్లపైకి వెళ్ళి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com